బోధన్: పట్టణంలోని గౌడ్స్ కాలనీలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన,భవన నిర్మాణం కోసం 47 గజాల స్థలాన్ని పట్టణ కేంద్రానికి చెందిన చల్లా మమత శ్రీనివాస్( పూజారి శ్రీనివాస్) వితరణ చేశారు.ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో లైబ్రరీ,మొదటి అంతస్తు లో మీటింగ్ హాల్, రెండో అంతస్తులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తె లిపారు. మంగళవారం గౌడ్స్ కాలనీలో దాత వితరణ చేసిన స్థలంలో అంబేడ్కర్ జయంతిని నిర్వహించి స్థల దాతను కాలనీవాసులు సన్మానించారు.అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవరావు, వ్యాపారే గంగాధర్,మెస్రా మండల ఎంఈవో నాగ్‌నాథ్,మాజీ ఎంపీటీసీ సూ ర్య నాగన్న, కాలనీవాసులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.


