ఆర్మూర్ అంబేడ్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేస్తున్న నాయకులు
పచ్చలనడ్కుడలో ట్రాఫిక్ నియమాలపై ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై సంజీవ్
ఆర్మూర్‌టౌన్/వేల్పూర్/రుద్రూర్/నందిపేట్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే, రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌పల్లెగంగారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరిరఘు, కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డిలు అన్నారు. పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్యం సేవించి, హెల్మెట్ లే కుండా వాహనాలు నడుపొద్దన్నారు, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, మార్కెట్‌కమిటీ చైర్మన్‌సాయిబాబాగౌడ్, బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, మైనారిటీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్, పచ్చలనడ్కుడ, పడగల్, అమీనాపూర్, అక్లూర్ గ్రామాలలో ట్రాఫిక్ నియమాలపై వేల్పూర్ ఎస్సై సంజీవ్ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, హెల్మెట్, సీటు బెల్టు ధరిస్తానని, మద్యం తాగి వాహనం నడుపకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేయించారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్, మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్ర హల వద్ద ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి సర్కిల్ ఇనన్‌స్పెక్టర్ కృష్ణ హాజరై రహదారి ని యమాల ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం పోలీసులు, స్థానిక ప్రజలు రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. అంతకు ముందు సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామంలో నందిపేట పో లీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన క ల్పించారు. గ్రామ ప్రజల చేత రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తామని ఎస్‌ఐ శ్యామ్ రాజ్ ప్రతిజ్ఞ చేయించారు. గ్రామానికి చెందిన శ్రీసాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కాసిరే సతీష్ తమ వంతు సామాజిక బాధ్యతగా గ్రామ ప్రజల భద్రత కోసం లక్కీ డ్రా ద్వారా హెల్మెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ బి. జీవన్, ఉప సర్పంచ్ కె. విష్ణు, వార్డు సభ్యులు ఎ. చిన్న గంగాధర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


