● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
బోధన్‌టౌన్(బోధన్): వేసవిలో తాగు నీటిఎద్దడి లేకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ స లహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బల్దియా, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. పాత ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పునరుద్ధరణ పనులను ప్రారంభించడంతో పాటు పనులను వేగవంతం చేయాలని పైప్ లైన్ పనులు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల జాబితా ఖరారు ప్రక్రియను సబ్ కలెక్టర్, తహసీల్దార్‌లు పర్యవేక్షించాలని సూచించారు.
డ్రైవర్లదే బాధ్యత
బోధన్ బల్దియా పరిధిలోని 38 వార్డుల్లో చెత్త సేకర ణ కోసం నూనతంగా కొనుగోలు చేసిన ఆటోల ఇంధన, నిర్వహణ బాధ్యత డ్రైవర్లదే అని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇంటింటికి చెత్త చెత్త సేకరణ చేస్తూ యూజర్ చార్జీలు వసూలు చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నలుగురు డ్రైవర్లకు ఆటోలను అందించారు. పట్టణంలోని 35 వ వార్డులో పర్యటించారు. డ్రెన్‌ల డిసిల్టింగ్ కోసం నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్‌వేటర్ పని తీరును పరి శీలించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి సుదర్శన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వి కాస్ మహతో. మున్సిపల్ చైర్ పర్సన్ తూము ప ద్మాశరత్ రెడ్డి, అధికారులు దళిత సంఘాల నాయకులు నివాళులు అర్పించారు
99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట నారాయణ అధికారులతో పాటు ఇతర నాయకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బోధన్ : ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పొల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. సర్పంచ్ కందగట్ల రాంచందర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి లో కుర్నాపల్లి నుంచి బోధన్ మండలంలోని ఏరాజ్‌పల్లి వరకు ఏడున్నర కిలోమీటర్ల పొడువు గల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల 10 లక్షలతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.


