అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

నందిపేట్‌(ఆర్మూర్‌): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన బీఆర్‌ అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా కాంగ్రెస్‌ కమి టీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని వెల్మల్‌ గ్రా మంలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా నగేశ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్‌ పార్టీ, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు లింగం, సిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకష్ణ, మండల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు గాదరి గోపి, ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్‌, సర్పంచ్‌ లు ఎర్రం లింగం, గాదరి నవీన్‌, సంతోష్‌ గౌడ్‌, ఆర్మూర్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement