పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్, లిల్లిపుట్ పాఠశాలలో ఉత్తమ ఒలింపియాడ్ పాఠశాలలుగా ఎంపికయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థా యి ఒలింపియాడ్ పరీక్షల్లో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీంతో హైదరబాద్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు పాఠశాలల విద్యార్థులను అకాడమీ ప్రతినిధులు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నలంద ప్రసాద్,నలంద సాగర్, లిల్లిపుట్ రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.


