ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్‌చౌరస్తా వద్ద మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ యువజన నాయకుడు విజయ్ అగర్వాల్ ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరిరఘు, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు విజయ్ అగర్వాల్‌ను అభినందించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్‌లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నూత్‌పల్లిలో మక్కల
కొనుగోలుకు అనుమతి
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నూత్ పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సొసైటీ సీఈవో కృష్ణ కుమార్ తెలిపారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారుల నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఈ కేంద్రాన్ని బుధవారం నూత్‌పల్లిలో ప్రారంభించి మక్కలను కొనుగోలు చేస్తామన్నారు.


