ఏసీబీ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ కార్యాలయం ప్రారంభం

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

ఏసీబీ కార్యాలయం ప్రారంభం ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాయి చైతన్య సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనంలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ (వెస్ట్‌ జోన్‌) కమలాకర్‌ రెడ్డి, డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ వేణుకుమార్‌, నాగేశ్‌ పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు తప్పనిసరిగా పాటించాలని టీజీఎస్‌ ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ జ్యోత్స్న తెలిపారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్‌.. అలైవ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం మధుసూదన్‌, ఏఎంవీఐ పవన్‌కల్యాణ్‌, ఆరు డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనాథ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత

సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌ రూరల్‌: సమాజంలోని అనాథ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాయిచైతన్య పేర్కొన్నారు. మండలంలోని శాస్త్రీనగర్‌ నిర్మల భవ న్‌ అనాథ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఆరోగ్యం, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ, సౌత్‌ రూరల్‌ సీఐ సతీశ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌, ఆర్‌ఐ వినోద్‌, ఎస్సై వెంకట్‌రావు, సర్పంచ్‌ నరాల జ్యోతి పాల్గొన్నారు.

ఆల్ప్రాజోలం పట్టివేత

ఎల్లారెడ్డి: నిషేధిత మత్తు పదార్థం ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పులి రమేశ్‌ తన స్నేహితుడైన ఓలెపు రమేశ్‌, మధ్యవర్తి హసన్‌పల్లి అనిల్‌కుమార్‌ ద్వారా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన చేపర్తి ఈశ్వర్‌గౌడ్‌కు ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు రూ.5 వేలకుఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం పులి రమేశ్‌ సూచనల మేరకు కొనుగోలుదారుకు సాంపిల్‌ చూపించేందుకు 101 గ్రాముల మత్తు పదార్థాన్ని తీసుకొని ఓలెపు రమేశ్‌, అనిల్‌ కుమార్‌ గండిమాసానిపేట గేట్‌ వద్దకు బైక్‌పై వచ్చారు. పోలీసులు నిందితులను పట్టుకొని 101 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement