‘ఆల్ఫోర్స్‌’ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

‘ఆల్ఫోర్స్‌’ ప్రభంజనం

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

ఖలీల్‌వాడి: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి వెల్లడించారు. నగరంలోని గంగాస్థాన్‌ ఆల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను ఆయన సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల క్రితం ఆల్ఫోర్స్‌ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఆనేక ఆటంకాలు సృష్టించారని, వాటిటన్నింటినీ తట్టుకొని నిలబడి రాష్ట్ర, జిల్లాస్థాయి ర్యాంకులు సాధించామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది సహకారంతోపాటు విద్యార్థుల క్రమశిక్షణతో అత్యుత్తమ మార్కులు సాధించామని తెలిపారు. జేఈఈ(మెయిన్స్‌), జేఈఈ(అడ్వాన్స్‌డ్‌), నీట్‌, ఐఐటీతోపాటు ఎంసెట్‌ వంటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వై.శ్రీనిత్య 996 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఎం.విరేష్ని 991, కే సోనాలిక 990, ఎం అస్మిత 990 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. బైపీసీలో హిరణ్య 987, ఎల్‌.అశ్విని 987, బి.అదితి 914 మార్కులు సాధించారని తెలిపారు.

ఫస్టియర్‌ ఎంపీసీలో వినీష 469, జి.అక్షర 469 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. డీ పూజ 468, జి.రాజేశ్వరి 468, ఎం.స్మిత 467, కే.గంగోత్రి 467, జి.యక్షిత్‌ 467, కే.మనీషా, మనోజ్ఞ 466, కే సూర్యకు 465 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. మరో 61 మంది విద్యార్థులకు 464 మార్కులు, 176 మంది విద్యార్థులకు 463 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీలో ఎస్‌.జాగృతి 439, హస్విత 439, ఖాన్సా అలియా 439, కే.రిషిత 435, ఎస్‌.కారుణ్య 435, గ్రీష్మ 432, వరలక్ష్మి 428 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో ఎం. ప్రంజల్‌ పాండే 448 మార్కులు సాధించారని చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement