● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
● సమన్వయ కమిటీ ఏర్పాటు
నిజామాబాద్‌అర్బన్:అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ టీకాలు తప్పనిసరి వేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. హెచ్‌పీవీ టీకాల కార్యక్రమ పర్యవేక్షణకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 14 సంవత్సరాల బాలికల కోసం హెచ్‌పీవీ టీకాలు వేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కన్వీనర్‌గా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ పని చేస్తుందన్నారు. జిల్లాలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని వసతి గృహాలు పరిశుభ్రతను పాటించేలా, విద్యార్థులకు కీలక జనిత వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పా టు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్‌వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.


