ఆర్మూర్/నిజామాబాద్ రూరల్ : చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రో జుల కార్యాచరణలో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ కా ర్యక్రమాల అమలుపై సోమ వారం జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఆర్మూ ర్ మండలం పిప్రిలో నిర్వహించిన గ్రామ స భకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూర ల్ మండలం శాస్త్రినగర్‌లో నిర్వహించిన సభకు సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ సభల్లో పలు తీర్మానాలు చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఆయా సభల్లో కలెక్టర్, సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థా యి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ‘అరైవ్ – అలైవ్’ కార్య క్రమ ప్రధాన లక్ష్య మని పేర్కొన్నారు. రోడ్డు ప్రమా దాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలని కోరా రు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం ‘రహ్–వీర్’ కింద రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయపడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అపోహను వీడి విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే శాస్త్రి నగర్ నుంచి ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు పంపిస్తామని సీపీ ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ కిరణ్, నరాల జ్యోతి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో స త్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, నిజామాబాద్ ఇన్‌చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాదు సౌత్ రూర ల్ సీఐ సురేశ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వినోద్, ఆరోటౌన్ ఎస్సై వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రినగర్‌లో వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీ సాయిచైతన్య, తదితరులు
పిప్రిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు
సమష్టిగా కృషి చేద్దాం
బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి
‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య


