ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎస్సెస్సీ సెంటర్‌తోపాటు మామిడిపల్లిలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ, పరీక్షల నిర్వహణ సిబ్బంది ఉన్నారు.
ఏడాదంతా కష్టపడి చదివిన పదో తరగతి విద్యార్థులు తమకు ‘పరీక్ష’ ముగిసిందని ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. సుమారు నెలరోజులపాటు పరీక్షలు కొనసాగాయి. పరీక్షలు ముగియడంతో ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందంగా ఇంటిబాటపట్టారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
సోషల్ ఎగ్జామ్‌కు
44 మంది గైర్హాజరు
ఖలీల్‌వాడి: ఎస్సెస్సీ పరీక్షల్లో భాగంగా సోమవారం సోషల్ ఎగ్జామ్ నిర్వహించగా 44 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్‌కుమార్ తెలిపారు. 24,401 మంది రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఎనిమి ది మంది ప్రయివేట్ విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, రెగ్యులర్ విద్యార్థులు 41 మంది, ప్రయివేట్ విద్యార్థులు ముగ్గురు గైర్హాజరయ్యారన్నారు. 144 సెంటర్లకుగాను 67 సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ రెండు సెంటర్లను తనిఖీ చేశారన్నారు.


