సుభాష్‌నగర్: జిల్లా కేంద్ర ప్రభు త్వ జనరల్ ఆస్ప త్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా ఫోరెన్సిక్ వి భాగాధిపతి డాక్టర్ నాగమోహన్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యు లు, సిబ్బంది సహకారంతో రోగులకు నా ణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగమోహన్‌రావును జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది డాక్టర్ రాము లు, మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ సూప రింటెండెంట్ నాగరాజు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ
పీవీ రాజేశ్వర్‌రావు
సుభాష్‌నగర్: నిజామాబాద్ సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సూపరింటెండింగ్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2024–2025తో పోల్చితే 2025–2026 సంవత్సరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. 11 కేవీ బ్రేక్‌డౌన్స్ గతేడాదితో పోలిస్తే ఈఏడాది 41 శాతం తగ్గగా, ట్రిప్పింగ్స్ 39 శాతం తగ్గినట్లు తెలిపారు. ఈసంవత్సరంలో ఓవర్ లోడ్ సమస్యలను నివారించేందుకు 344 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 19 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా 15 సబ్‌స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. లైన్ల నిర్వ హణ, జంపర్లు సరిదిద్దడం, వంగిన విద్యుత్ స్తంభాల సవరింపు వంటి చర్యల ద్వారా సరఫరా స్ధిరత్వాన్ని పెంచామని పేర్కొన్నా రు. లో ఓల్టేజీ సమస్య నివారణకు 40 కెపా సిటర్ బ్యాంకులను క్షేత్ర స్థాయిలో ఏర్పాటుచేశామని తెలిపారు. విద్యుత్‌సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వినియోగదారులు సమీప సెక్షన్ కార్యాలయం, లైన్‌మెన్ దృష్టికి తీసుకెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ఎస్‌ఈ తెలిపారు.
పోలీస్ ప్రజావాణిలో
24 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలీస్ ప్రజావాణిలో సోమవారం తమ ఫిర్యాదులను అందజేశారు. సీపీ సాయిచైతన్య మొత్తం 24 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు తమ సమస్యలను విన్నవించగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్‌ల అధికారులను సీపీ ఆదేశించారు.
కేజీబీవీలో
86.36 శాతం ఉత్తీర్ణత
ఖలీల్‌వాడి: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులు 86.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో పార్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 కేజీబీవీ లు ఉండగా, 11 స్కూళ్లలో ఇంటర్ సెకండియర్, 16 స్కూళ్లలో ఫస్టియర్ పరీక్షలు జరిగాయన్నారు. ద్వితీయ సంవత్సరంలో 528 మందికి 456 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫస్టియర్‌లో 800 మంది విద్యార్థినులకు 596 మంది పాసైనట్లు పేర్కొన్నారు.


