హత్య కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్టు

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

మాక్లూర్‌: హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్త్‌ జోన్‌ సీఐ శ్రీనివాస్‌, మాక్లూర్‌ ఎస్సై రాజశేఖర్‌ పేర్కొన్నారు. మాక్లూర్‌ పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మెట్టు గ్రామానికి చెందిన బుగ్గ ఆంటోనీ(55) ఈ నెల 10న హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడు అబ్రహాం ఫిర్యాదు మేరకు విచారించగా ఈ నెల 10న రాత్రి ఆంటోనీ, అదే గ్రామానికి చెందిన ప్రాంచీస్‌ కలిసి ప్రకృతి వనం వద్ద మద్యం సేవించారు. మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ప్రాంచీస్‌ పెద్ద బండరాయితో ఆంటోనీ తలపై కొట్టడమే కాకుండా కొంతదూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ప్రాణాలు విడిచాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్రాంచీస్‌ ఇంటికి వెళ్లి స్నా నం చేసి పరారయ్యాడు. సోమవారం ప్రాంచీస్‌ను పట్టుకొని విచారించగా హత్యకు ఉపయోగించిన బండరాయి, దుస్తులు స్వాధీనం చేసుకొని ప్రాంచీస్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement