అద్విత.. ఆలోచన అద్భుతం | - | Sakshi
Sakshi News home page

అద్విత.. ఆలోచన అద్భుతం

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

అభినందించిన సీపీ

నిజామాబాద్‌ అర్బన్‌: గూపన్‌పల్లి గ్రామానికి చెందిన అద్వితను సీపీ సాయిచైతన్య అభినందించారు. గత కొన్ని నెలలుగా అద్విత తాను దాచుకుంటున్న డబ్బులతో హెల్మెట్‌లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తోంది. తన తండ్రి బేనీ ఇచ్చిన డబ్బులను దాచుకొని హెల్మెట్‌లు అందజేయాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం శాస్త్రీనగర్‌లో పోలీస్‌శాఖ నిర్వహించిన ‘అరైవ్‌ అలైవ్‌’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో తనవంతుగా గ్రామస్తులకు హెల్మెట్‌లను పంపిణీ చేసింది. దీంతో పోలీస్‌ కమిషనర్‌ అద్వితను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement