సాక్షి, నెట్‌వర్క్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లా కు చెందిన పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. మా క్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతీబా ఫూలే బాలికల కళాశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ బైపీసీలో జి.రుచితకు 438, శెట్టి తేజకు 436 మార్కులు వచ్చాయి. ఇందల్వాయి కేజీబీవీ విద్యార్థిని బదావత్ మనీషా ఫస్టియర్ ఎంపీసీలో 465 మార్కులు సాధించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ సెకండియర్ 100 శాతం, ఫస్టియర్‌లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎడపల్లిలోని టీజీఆర్‌జేసీ విద్యార్థులు ఎంపీసీ ఫస్టియర్‌లో శ్రీజ, దీపికా, చందనా, శ్రీనిధి 466 మార్కులు, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో అమృత 992, భవానీ 991, బైపీసీలో వర్ష 989, భార్గవి 987 మార్కులు సాధించారు. రుద్రూర్ కేజీబీవీ విద్యార్థులు ఫస్టియర్‌లో 98.2 శాతం పాసయ్యారు. ఎంపీసీలో ఎం.మధుశ్రీకి 466 మార్కులు వచ్చాయి. మోపాల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు సెకండియర్‌లో 76 మందికి 72 మంది ఉత్తీర్ణత సాధించారు.


