క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కామారెడ్డి రూరల్‌: చెరువులో ఈతకు వెళ్లిన ఓ వి ద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందా డు.వివరాలు ఇలా..కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి లోని టేక్రియాల్‌ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాకేష్‌ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగ తి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం చెరువులో ఈత కొట్టడానికి ముగ్గురు వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు రాకేష్‌ చెరువులో ఉన్న గుంతలో ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ షాక్‌తో ఆవు ..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాలో కేతావత్‌ జీలియా నాయక్‌కు చెందిన జెర్సీ ఆవు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందింది. రోజూ మాదిరిగానే ఆవు గ్రామ శివారులోని పంట చేనులో మేతకు వెళ్లగా సర్వీసు వైరుకు తాకడంతో విద్యుత్‌ షాక్‌ రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ. 80వేలు నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement