నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాసాన్‌పల్లి గ్రామశివారులో బోరుమోటార్ చోరీకి గురికాగా, ఆదివారం కేసునమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. గ్రామంలోని సూర్యకుమార్‌కు చెందిన పొలం సమీపంలోగల నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ చెరువు గండి నుంచి ఓపెన్ వెల్ మోటార్‌ను గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసునమోదు చేసినట్లు ఆయన చెప్పారు.


