ఖలీల్‌వాడి: జిల్లాలోని పలు ప్రయివేట్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సెకండియర్ ఎంపీసీలో శ్రీనాథియా 996 మార్కులు, బైపీసీలో హిరణ్య, ఆశ్విని 987 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను రాజేశ్వరి, పూజిత, అక్షిత 468 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను నిశిత, కారుణ్య 435 మార్కులు, గిర్మిష 432 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంఈసీలో ప్రజ్వల్ పాండే 448/500 మార్కులను సాధించారు. విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అభినందించారు.
సత్తా చాటిన బన్సల్ విద్యార్థులు
నగరంలోని బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎంపీసీ ఫస్టియర్‌లో నమిత్, శ్రీహిత 468 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు. బైపీసీ ఫస్టియర్‌లో తీన్యశ్రీ 435 మార్కులు, శ్లోకా జాదవ్ 433 మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండియర్‌లో ధనుష్ 974 మార్కులు, రోనిత్ 973 మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్‌లో ప్రవీణ్ 971 మార్కులు, నరేష్ 961 మార్కులు సాధించారు. విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.
నారాయణ స్టేట్ ఫస్ట్..
ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని గట్ల వరేణ్య ఎంపీసీ ఫస్టియర్‌లో 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల డీన్ మంజుల, ప్రిన్సిపాల్ సిహెచ్ రవిగౌడ్ తెలిపారు. అలాగే ఎంపీసీ సెకండియర్‌లో అయేషా ఆఫీఫా 994 మార్కులు సాధించారన్నారు. సింధు హర్షిని, సద్ధి అక్షిత 992 మార్కులు, కార్తీక 988, బండ సాహితి 984, విరాజ్ 982 మార్కులు సాధించారు. విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందించారు.


