సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

ఖలీల్‌వాడి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న బాలబాలికలు అత్యుత్తమ మార్కులను సాధించారని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో బైపీసీ సెకండియర్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని మదిహ శహవర్‌ 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించారన్నారు. అలాగే ఉమేమా అంజిర్‌ 982 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని సాయిబా తహసిన్‌ 978 మార్కులు, శ్రీమయి 977 మార్కులు సాధించారని తెలిపారు. హెచ్‌ఈసీ గ్రూప్‌లో ఆర్మూర్‌ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని రమ్య 946 మార్కులు సాధించారని, సీఈసీలో నిజామాబాద్‌ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని అయేషా ఫాతిమా 904 మార్కులు సాధించారని తెలిపారు. బాలికల జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో తాళ్ల హర్షినీ 470 మార్కులకు గాను 462 మార్కులను పొందారని, బైపీసీలో సమీరా 440 మార్కులకు గాను 425 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీఈసీలో మహేక్‌ ఫిర్దోస్‌ 500 మార్కులకు గాను 470 మార్కులు, హెచ్‌ఈసీలో 500 మార్కులకు గాను 432 మార్కులు సాధించారని తెలిపారు.

పెర్కిట్‌ మోడల్‌ స్కూల్‌..

పెర్కిట్‌(ఆర్మూర్‌): పెర్కిట్‌లోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని బీ నితీష ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించింది. అలాగే హెచ్‌ కౌసర్‌ బైపీసీలో 981, శ్రీవాణి సీఈసీలో 958 మార్కులు సాధించింది. మొదటి సంవత్సరంలో జల్ద శ్రీమాయి ఎంపీసీలో 454 మార్కులు, సిద్ర హఫీజా బైపీసీలో 418 మార్కులు, గట్ల ప్రణవి సీఈసీలో 479 మార్కులు సాధించింది.

ఎడపల్లి బాలికల గురుకుల కళాశాల..

బోధన్‌: ఎడపల్లి శివారులోని టీజీ ఆర్‌జేసీ(తెలంగాణ బాలికల గురుకుల కళాశాల) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్‌ గంగాశంకర్‌ తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్‌లో 43 మందికిగాను 37 మంది, సెకండియర్‌లో 34మందికిగాను 33 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బైపీసీ ఫస్టియర్‌లో 42 మందికి గాను 37 మంది, సెకండియర్‌లో 29 మందికిగాను 29 మంది ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యాన్నారు.

ఎంపీసీ ఫస్టియర్‌లో శ్రీజా, దీపికా, చందనా, శ్రీనిధి 470 మార్కులకుగాను 466 మార్కులు సాధించారన్నారు. మానస్‌నితా, శివాణి 464 మార్కులు, బైపీసీ ఫస్టియర్‌లో 440 మార్కులకుగాను గంగు 436, ప్రణవి 434 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీ సెకండియర్‌లో అమృతా 992, భవానీ 991, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో వర్షా 989, భార్గవి 987 మార్కులు సాధించారని ప్రిన్సిపల్‌ తెలిపారు.

ఇందల్వాయి కేజీబీవీ..

ఇందల్వాయి: ఇందల్వాయి కేజీబీవీలో 33 మంది విద్యార్థినులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 70 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రత్యేక అధికారి వర్ష తెలిపారు. ధర్పల్లి మండలం దుబ్బాకకు చెందిన బదావత్‌ మనీషా ఎంపీసీలో 465/470 మార్కులు సాధించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement