నిజామాబాద్ రూరల్: మహాత్మా జ్యోతీబాఫూలే బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని, ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. దుబ్బలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్‌లోని పూలే విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు పూలే కొనసాగించిన కృషి అమోఘమన్నారు. పూలే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
సుభాష్‌నగర్: నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో జ్యోతీబాఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయంలో పూలే చిత్రపటానికి, అనంతరం వినాయక్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఫూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ కొనియాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, డీసీసీ నాయకులు భక్తవత్సలం, కౌడపు శరత్, ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఘన్ రాజ్, కార్పొరేటర్లు ప్రవీణ్, మనోహర్, వినయ్, జెండా గుండి చైర్మన్ లవంగం ప్రమోద్‌కుమార్, కోనేరు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.


