పసుపు పరిశ్రమను సందర్శించిన సహకార యూనియన్‌ ఎండీ | - | Sakshi
Sakshi News home page

పసుపు పరిశ్రమను సందర్శించిన సహకార యూనియన్‌ ఎండీ

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

జక్రాన్‌పల్లి:మండలంలోని మనోహరాబాద్‌ గ్రా మంలో ఉన్న పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘా న్ని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నపూర్ణ గురువారం సందర్శించారు. నిజామాబాద్‌ డీసీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు పరిశ్రమను సందర్శించి పలు విషయాలను కూలంకషంగా చర్చించారు. రైతులందరూ పండించిన పంటను విలువ ఆధారిత వస్తువుగా తయారు చేయడం, రైతే వ్యాపారస్తులు కావాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని రాష్ట్ర అధికారుల బృందం అభినందించింది. పరిశ్రమ వివరాలను సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలియజేస్తూ భవిష్యత్తులో మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని ఎండీని కోరారు. కార్యక్రమంలో సహకార యూనియన్‌ ప్రిన్సిపల్‌ వెంకన్న, డిప్యూటీ రిజిస్ట్రార్‌ వెంకట్‌ రెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ సురేఖ, డిప్యూటీ రిజిస్ట్రార్‌ హరిణి, డైరెక్టర్లు అల్లూరి సంతోష్‌, పుప్పాల నాగేశ్వరరావు, సూపర్‌వైజర్‌ రుత్విక్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement