చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

బీసీ వసతిగృహ విద్యార్థులకు ‘ప్రేరణ’

ఖలీల్‌వాడి : విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చ దువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఉద్బోధించారు. వి ద్యను ఆయుధంగా మల్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ‘ప్రేరణ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌.. విద్యార్థులకు ప దో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదో తరగతి తొలిమెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబ ద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్ధులు కావాలని సూచించారు. ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ల క్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. చదు వు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లిదండ్రులు ప డే కష్టాన్ని గుర్తుచేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. బాలికలు పట్టుదల తో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రద ర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్‌ స్క్రీన్‌పై టీ20 వరల్డ్‌ కప్‌ లైవ్‌ మ్యాచ్‌ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని వి ద్యార్థులకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన తరుణంలో సమయం ఏమాత్రం వృథా కా కుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉ పాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement