చికిత్స పొందుతూ వార్డు సభ్యుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వార్డు సభ్యుడు మృతి

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

చికిత్స పొందుతూ  వార్డు సభ్యుడు మృతి

చికిత్స పొందుతూ వార్డు సభ్యుడు మృతి

చికిత్స పొందుతూ వార్డు సభ్యుడు మృతి నాటుసారా స్వాధీనం.. ఒకరిపై కేసు నమోదు

ఎల్లారెడ్డి: మండలంలోని మౌళాన్‌ఖేడ్‌ గ్రామ వార్డు సభ్యుడు మారటి పోచయ్య (47) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల క్రితం పోచయ్య ఎల్లారెడ్డి నుంచి మౌళాన్‌ఖేడ్‌కు వస్తుండగా అడవిపందులు అడ్డు రావడంతో బైక్‌పై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోచయ్యను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడన్నారు. 3వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న పోచయ్య నెల రోజులు తిరగక ముందే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంలక్ష్మణ్‌పల్లి గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకావత్‌ రాము కొంతకాలంగా తన ఇంట్లో నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. కూలర్‌లో రెండు ప్లాస్టిక్‌ సీసాల్లో అక్రమంగా దాచి ఉంచిన నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement