కిలో 265 గ్రాముల గంజాయి స్వాధీనం
● నిందితుడి రిమాండ్
బోధన్‌టౌన్(బోధన్): అక్రమంగా గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. పట్టణంలోని రవి గార్డెన్ వద్ద బైపాస్ రోడ్‌లో ఎస్సై భాస్కరా చారీ వాహనాలు తనిఖీ చేస్తుండగా రాకాసీపేట్‌కు చెందిన మహ్మద్ అష్రఫ్ అలీ అలి యాస్ అష్రఫొద్దీన్ స్కూటీ డిక్కీలో కిలో 265 గ్రా ముల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని స్కూటీని, గంజాయిని స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు. అష్రఫొద్దిన్‌ను విచా రించగా తన తండ్రి రషీదొద్దీన్‌తో కలిసి నాందెడ్‌కు చెందిన ఫేరోజ్, షేక్ మాజిద్‌ల నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి ఇక్కడ కాలేజీ యువకులకు, కూలీ పని చేసేవారికి విక్రయిస్తున్నట్లు వెల్లడించారన్నారు. అష్రఫొద్దీన్ నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది ఉన్నారు.


