పునరావాసంలో పుట్టెడు కష్టాలు
కిలోమీటర్ల మేర నడవాల్సిందే..
● కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న గరీబ్ నవాజ్ కాలనీవాసులు
● పాలకులు మారుతున్నా
అభివృద్ధికి నోచుకోని వైనం
బోధన్ : ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అని ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న పాడిన పాట బోధన్ పట్టణ శివారులోని గరీబ్ నవాజ్ కాలనీ పరిస్థితులకు అద్దం పడుతోంది. బోధన్ –నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న ఆచన్‌పల్లి ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో పాండుఫారం శివారులో గల ఈ కాలనీలో కనీస సౌకర్యాలు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీ మున్సిపల్ ఒకటో వార్డు పరిధిలోకి వస్తుంది. కాలనీలో రెక్కలు తప్ప ఇతర ఎలాంటి ఆస్తులు లేని 35 నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయి. దినసరి కూలీపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పిచ్చిమొక్కలు.. ముళ్ల పొదలు
15 ఏళ్ల క్రితం పట్టణంలోని అనిల్ టాకీస్ ఏరియా లోని ఖాళీ ప్రదేశాల్లో చిన్న గుడారాలు వేసుకొని జీ విస్తున్న జనానికి పునరావాసం కల్పించేందుకు పాండుఫారం శివారులో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో ప్లాస్టిక్ కవర్లతో కొందరు గుడారాలు వేసుకోగా, మ రికొందరు ఇనుప రేకులతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవు. వీరి గుడారాల చుట్టూ పిచ్చిమొక్క లు, ముళ్ల పొదలు అల్లుకుపోయాయి. ఎక్కడి నుంచి ఏ విషపురుగు కాటు వేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. పాములు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీవాసులను అసలు మనుషులుగా అధికార యంత్రాంగం, పాలకులు గుర్తించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నేను నా భర్త, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాను. కాలనీలోని తమ గుడారాల చుట్టూ పాము లు, తేళ్లు తిరుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాం. కనీసం సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించండి. ఏ అవసరానికై నా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– సాయమ్మ, కాలనీవాసి
రేషన్‌బియ్యం, పిల్లల చదువుకు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆచన్‌పల్లికి ఈ కాలనీ ప్రజలు వెళ్లాల్సి వస్తుంది. వైద్యం కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధన్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్తామని స్థానికులు చెబుతున్నారు. పునరావా సం కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచినా కనీస సౌక ర్యాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టలేదు. మున్సిపల్ పాలకులు మారుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో తన్నుకొస్తుంది. కొన్నేళ్ల నుంచి కాలనీవాసులు మున్సిపల్ శాఖ అధికారులు, సబ్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకున్నారు.
పునరావాసంలో పుట్టెడు కష్టాలు
పునరావాసంలో పుట్టెడు కష్టాలు
పునరావాసంలో పుట్టెడు కష్టాలు


