అవసరానికి సరిపడా యూరియా నిల్వలు
ఆర్మూర్ : జిల్లాలో అవసరానికి సరిపడా యూరి యా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్‌లోని సహకార సంఘం ఎరువుల గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతు లతో మాట్లాడారు. సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సైతం ఎరువుల కొరత ఉండబోదని అన్నారు. అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. సహకార సంఘాలు లేని చోట రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేసేలా చూడటంతోపాటు పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకూ ఎరువులు అందేలా చూస్తా మని స్పష్టం చేశారు. అవసరానికి అనుగుణంగా దశల వారీగా ఎరువులు తీసుకోవాలని, మోతాదుకు మించి వాడొద్దని రైతులకు సూచించారు.
నానో యూరియాపై అవగాహన
పెంచుకోవాలి
అంకాపూర్ గ్రామ శివారులో ఓ ఆదర్శ రైతు డ్రో న్‌ను వినియోగిస్తూ నానో యూరియాను పంటకు పిచికారీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులతో కలిసి పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు సైతం అవగాహన పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌కు స్థల పరిశీలన..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ఆర్మూర్ మండ లం అంకాపూర్, పిప్రి శివార్లలో స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ప్రతిపాదనలు పంపించాలని రె వెన్యూ అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరి స్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు.
వచ్చే ఖరీఫ్ సీజన్‌లోనూ కొరత ఉండదు
రైతులకు ఎరువులు అందేలా
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం
సొసైటీలు లేనిచోట్ల
రైతు వేదికల ద్వారా పంపిణీ
కలెక్టర్ ఇలా త్రిపాఠి
అవసరానికి సరిపడా యూరియా నిల్వలు


