జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఎలక్షన్ కోడ్ కచ్చితంగా అమలు చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఎన్నికల విధుల్లో పా ల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్ని కల నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలన్నా రు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా.. శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అదనపు డీసీ పీ బస్వారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్, బో ధన్ ట్రాఫిక్ ఏసీపీలు రాజావెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో
పని చేయాలి
నిజామాబాద్ రూరల్: జిల్లా అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆయన మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
జిల్లాకు 22 మంది ల్యాబ్ టెక్నీషియన్లు
బోధన్: ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో మంగళవారం నియమాకపత్రాలు అందించారు. ఇందులో జిల్లాకు చెందిన 22 మంది నియామక పత్రాలు అందుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాల్లో వీరు విధులు నిర్వహించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాలతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షల సేవలు మరింత వేగవంతం అవుతాయని సంబంధిత శాఖ అధికా రుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి రైతూ ఎఫ్‌పీవోలో సభ్యుడిగా చేరాలి
ఇందల్వాయి: ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేష న్(ఎఫ్‌పీవో)లో ప్రతి రైతూ సభ్యుడిగా చే రాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రా వు అన్నారు. మండలంలోని నల్లవెల్లిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో డీసీవో అవగాహన కల్పించారు. జిల్లాలో 89 సహకార సంఘాలు ఉండగా.. ఉత్తమ పనితీరు కలిగిన 12 సంఘా ల ను ఎఫ్‌పీవోలకు ఎంపిక చేసినట్లు తెలిపా రు. కనీసం 15 లక్షల మూలధనం కలిగి ఉంటే దానికి మరో 15 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, దాని ద్వారా ఎఫ్‌పీవోలు సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సీఈవో తేజాగౌడ్, ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ ధన్ల రాజు, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి క్యాషియర్ రాజన్న, రైతులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు


