కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్: వాహనాలు నడుపుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ కుటుంబాల భద్రతకు భరోసాగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ –అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీపీ మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా మర ణించిన వారి కన్నా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. రెండేళ్లలో కరోనాతో 200 మంది చనిపోగా, 2025లో రోడ్డు ప్రమాదాల్లో 250 మంది చనిపోయారన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్‌లు, హెల్మెట్‌లు పెట్టుకోకుండా నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రా ఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు.
అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో తమ కుటుంబంలోని ఒకరిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి టీషర్ట్స్, ట్రాఫిక్ నిబంధనల స్లోగన్స్‌తో రూపొందించిన ప్లకార్డులను ఆవిష్కరించారు. విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సౌజన్యంతో వాహనదారులకు 100 హె ల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, ఆర్టీసీ డిపో మేనేజర్లు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, అంబులెన్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్‌ల అసోసియేషన్‌ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ సంఖ్యలో మరణించారు
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు
పాటించాలి : సీపీ సాయిచైతన్య


