శుభకాల భోగి
వర్ని: దక్షిణాయణంలోని ప్రతికూలతలను వదిలి ఉత్తరాయణంలోకి పయనించే శుభకాలానికి సంకేతం భోగి. సంక్రాంతి సంబురాల్లో భాగంగా నేడు భోగి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. రంగురంగుల ముగ్గులతో వాకిళ్లు హరివిల్లును తలపిస్తున్నాయి. ఆకాశంలో ఎగురుతున్న పతంగులు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతి ఇల్లూ పిండి వంటలతో ఘుమఘుమలాడుతోంది. మహిళలు వారం రో జుల ముందు నుంచే పిండి వంటలు తయారు చే స్తున్నారు. విదేశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంతూళ్లకు చేరి సందడి చేస్తున్నా రు. బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలిసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నా రు. యువత క్రికెట్ టోర్నీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా రకరకా ల ముగ్గులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మహిళలు, యువతులు రంగులు కొను గోలు చేసి పండగపూట వాకిళ్లను అందమైన ముగ్గులతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నారులకు ఆయు రారోగ్యాలు, ధనధాన్యాలు, కీర్తిప్రతిష్టలతో వెలు గొందాలని ఆకాంక్షిస్తూ భోగి పండ్లు పోయనున్నా రు. సుహాసినులు నోములు నోచుకోనున్నారు.
శ్రీనగర్‌లో పిండి వంటలు చేస్తున్న మహిళలు
శుభకాల భోగి
శుభకాల భోగి


