మీకు తెలుసా..
వాట్సాప్‌లో మీ–సేవ
రామారెడ్డి: ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకో. విద్యార్థుల ప్రవేశాల కోసమో.. ఇలా అన్నింటికీ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ తదితర పత్రాలు తప్పనిసరి. వీటన్నింటి కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడటం, మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం లాంటి తిప్పలు తప్పనున్నాయి. వీటితో పాటూ దాదాపు 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను తాజాగా ఫోన్ ద్వారా వాట్సప్ నంబర్ 8096958096 నుంచే అందుబాటులోకి రానున్నాయి.
● కామారెడ్డి జిల్లాలో 180 మీసేవలున్నాయి.
● ముందుగా ఫోన్‌లో అధికారిక మీ–సేవ వాట్సాప్ నంబరును సేవ్ చేసుకోవాలి.
● ఆ నంబరుకు మెనూ ఆప్షన్ టైప్ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవలజాబితావస్తుంది.
● ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన సేవను ఎంచుకోవాలి.
● దరఖాస్తు ఫారాన్ని వాట్సాప్‌లో ఇంటర్‌ఫేస్ ద్వారా పూర్తి చేయవచ్చు.
● అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్ర తులను వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు.
● ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.
● సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ సిద్ధం కాగానే దాని డౌన్‌లోడ్ లింక్ నేరుగా వాట్సాప్‌లోకి వస్తుంది.


