గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి
ఆర్మూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన్న వీబీ జీ రాం జీ ఉపాధి చట్టాన్ని సర్పంచులు కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచులను సన్మానించారు. అదేవిధంగా పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉరూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్నా, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా, సీనియర్ నాయకు డు మార చంద్రమోహన్, పార్టీ మండలాల అధ్యక్షులు మంద మహిపాల్, రవి ప్రకాశ్, భూమేశ్వర్ రెడ్డి, చిన్నారెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


