ఆర్టిజన్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి
● రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్ రెడ్డి
డిచ్‌పల్లి: విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో రెండు రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేయాలన్నారు. పీస్‌రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించి, 30 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్లు ఎస్ సాయిలు, ఎస్ చంద్రారెడ్డి, కో–చైర్మన్ ఎస్ శ్రీధర్ గౌడ్, వైస్ చైర్మన్ సంతోష్ నాయక్, సికిందర్, శ్రీకాంత్, మెట్టు జాషువా, తలారి తిరుపతి, మహేందర్ గౌడ్, బట్టు గంగాధర్, రవీందర్, రాజు, విజయ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
క్రైం కార్నర్
ఆర్టిజన్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి


