వీరన్నగుట్టలో షార్ట్‌సర్క్యూట్
రెంజల్: మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రామాలయం ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి షార్ట్‌సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న గోశాలలో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో గోశాలలోని గడ్డికట్టలు దగ్ధమవుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 14 గోవులను సురక్షితంగా బయటకు తరలించారు. విషయం తెలుసుకున్న బోధన్ ఫైరింగ్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఆలయ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి తరచూ మంటలు వస్తున్న విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు, ఆలక కమిటీ ప్రతినిధులు పేర్కొ న్నారు. ఇకనైనా ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
● గోశాలలో తప్పిన ప్రమాదం..
● 14 గోవులు సురక్షితం


