అంగన్‌వాడీలకు ‘ప్రయోజనం’ అందేనా?
ఆందోళనలు చేస్తాం..
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన శారద అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ 65 ఏళ్ల వయస్సు నిండటంతో రెండేళ్ల కింద పదవీ విరమణ చేశారు. ఆమెతోపాటు సుంకెట్‌కు చెందిన ఆలూరు గంగు, మోర్తాడ్‌లోని నూతికట్టు లక్ష్మి ఆయాలుగా పనిచే స్తూ పదవీ విరమణ చేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి రిటైర్మెంట్ బెన్‌ఫిట్‌ను అందించలేకపోయింది. ఇది ఒక్క శారద, గంగు, లక్ష్మిలకు ఎదురైన సమస్యనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఆయాలు, టీచర్లు పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జిల్లాలో 180 మంది ఎదురుచూపులు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసేవారిలో 65 ఏళ్ల వయస్సు నిండిన వారిని పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 120 మంది ఆయాలు, 60 మంది టీచర్లను రిటైర్‌మెంట్ చేయించింది. పదవి విరమణ చేసిన ఆయాలకు రూ.50 వేల చొప్పున, టీచర్లకు రూ.1 లక్ష వరకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయాలకు రూ.1 లక్ష, టీచర్లకు రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఉత్తర్వులలో మాత్రం 50 శాతం కోత విధించింది. ఉత్తర్వుల ప్రకారమైనా జిల్లాలోని ఆయాలు, టీచర్లకు రూ.1.20 కోట్ల నిధులను విడుదల చేస్తే సరిపోతుంది. రెండేళ్లుగా రిటైర్ అయిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు బెన్‌ఫిట్స్ కోసం నిరీక్షిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లకు బెనిఫిట్ సొమ్ము విడుదల చేయాలని కోరుతున్నారు. నిధులు విడదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మాదిరిగానే ఆయాలు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్‌ను అందిస్తే సంతోషంగా ఉంటుంది. హామీ ఇచ్చిన ప్రకారం కాకపోయినా ఉత్తర్వులలో ఉన్న విధంగానైనా అ మలు చేయాలి. నిధుల విడుదలలో నిర్లక్ష్యం తగదు. త్వరలో నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తాం.
– దేవగంగు,అంగన్‌వాడీ హెల్ప్‌ర్స్, టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
పదవీ విరమణ చేసిన ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మంజూరు కావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం మంజూరు చేయగానే వారికి సొమ్మును అందజేస్తాం.
– రసూల్ బీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
పదవీ విరమణ చేసిన ఆయాలు,
టీచర్లకు అందని బెనిఫిట్స్
ఆయాలకు రూ.50 వేలు, టీచర్లకు రూ.లక్ష అందజేస్తామన్న ప్రభుత్వం
రెండేళ్లు గడుస్తున్నా నయాపైసా
ఇవ్వని వైనం


