చాంపియన్‌గా నిఖత్ జరీన్
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ
పీవీ రాజేశ్వర్‌రావు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖిత్ పాల్గొని 51 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన నీతూను ఓడించింది. దీంతో నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సైతం బాక్సింగ్ పోటీల్లో గెలుపొందారు.
ఖాళీ ప్రదేశాల్లోనే
పతంగులు ఎగురవేయాలి
సుభాష్‌నగర్: విద్యుత్ లైన్లకు దూరంగా ఉండి సంక్రాంతి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు శనివారం ఒక ప్రకటనలో సూచించారు. పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. పతంగులను కేవలం ఖాళీ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే ఎగురవేయాలని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. పక్షులు, మనుషులకు హాని చేసే విద్యుత్ వాహకత కలిగిన ‘చైనా మాంజా’ను వాడొద్దని కోరారు. పతంగులు విద్యుత్ తీగలకు చిక్కుకుంటే, తొలగించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. ప్రహరీ లేని మేడలు, బాల్కానీల నుంచి, డాబాల పైన ఎట్టి పరిస్థితుల్లో పతంగులు ఎగురవేయకూడదని పేర్కొన్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ వైర్లపై పతంగులు, మాంజాలు చిక్కుకున్నా, విద్యుత్ వైర్లు తెగిపడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయాలని కోరారు.
చాంపియన్‌గా నిఖత్ జరీన్


