పీజీ పరీక్షలు వాయిదా
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 17 నుంచి జరగాల్సిన పీజీ 3, 9వ సెమిస్టర్ పరీక్షలను విద్యార్థుల వినతి మేరకు వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
తెయూ బీఎడ్, బీపీఎడ్ పరీక్షల తేదీ పొడిగింపు
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 16 నుంచి జరగాల్సిన బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను విద్యార్థుల కోరిక మేరకు ఈనెల 21 వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖలీల్‌వాడి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండవ సెమిస్టర్ ఆంగ్ల పాఠ్యాంశాల మెటీరియల్‌ను నగరంలోని జీజీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ్‌మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ దండు స్వామి సంపాదకత్వంలో మెటీరియల్‌ను రూపొందించారు. టీయూ ఆచార్యులు కెవి రమణాచారి, సమత విద్యార్థులకు ఉపయోగకరంగా మెటీరియల్ రూపొందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రచయితలు నాగజ్యోతి, ప్రతిభ, దస్తప్ప, అధ్యాపకులు రాజశేఖర్, నిఖత్ ఫాతిమా, లావణ్య, మౌనిక, సన్నీత్, వసంత్, స్థిత ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి):తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల క్రికెట్ (పురుషుల) టోర్నమెంట్ విజేతగా నిషిత డిగ్రీ కళాశాల జట్టు నిలిచింది. శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో జ రిగిన ఫైనల్ మ్యాచ్‌లో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై నిషిత డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు.విజేత జట్టుకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు ట్రోఫీని అందజేశారు.
సుభాష్‌నగర్: నిజామాబాద్‌లోని ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఎంపీ అర్వింద్ ధర్మపురి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సీపీ కార్యాలయంలోని సీపీ సాయి చైతన్యను ఎంపీ అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలపై చర్చించారు.


