ఉపాధిహామీ పథకం పేరు మార్పు సరికాదు
● మొత్తం పనిదినాలను కేంద్రమే భరించాలి
● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాద ని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి పాత పేరును, విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వలసలను నివా రించడానికి యూపీఏ హయాంలో 100 రోజుల ఉ పాధి హామీ పథకాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకా న్ని పేరు మారుస్తూనే దానిని నీరు గార్చే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. పని దినాలను 125 రోజులు పెంచి కేవలం 75 రోజులు మాత్రమే కేంద్రం భరిస్తుందని, 50 రోజుల పని భారాన్ని రాష్ట్రాలపై మోపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చిన యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఉత్తమాటే అని అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈనెల 20 నుంచి ఉపాధి హామీ పథకంపై కేంద్రం అన్యాయం గురించి ప్రజలకు వివరించాలని, అదేవిధంగా మొత్తం పని దినాలను కేంద్రమే భరించాలని ప్రతి గ్రామంలో సర్పంచులు తీర్మానం చేయాలని కోరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సురేష్ బాబా, యాదగిరి, రాజా నరేందర్ గౌడ్, సంతోష్, ఎజాస్, ఈసా, సాయిరెడ్డి, సర్పంచులు కిసాన్, జనార్దన్ పాల్గొన్నారు.


