జైలులో దోస్తీ.. ఏటీఎంల దోపిడీ
● మధ్యప్రదేశ్‌లో పరిచయమై
తెలంగాణలో చోరీలు
● అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: జైలులో పరిచయమైన నేరస్తులు విడుదల అనంతరం ఏటీఎంలను కొల్లగొడుతూ లక్షలు దోచుకుంటున్నారు. నగరంలోని ఖలీల్‌వాడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను దోచుకునేందుకు యత్నించిన వారని పోలీసులు శుక్రవారం జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.
చోరీలు ఇలా..
అబ్దుల్లా, అమీర్ మొదట హైదరాబాద్‌లో చోరీకి నిర్ణయించారు. తోడుగా అబీద్, అర్షద్‌ను కలుపుకున్నారు. ఏటీఎంను కొల్లగొట్టేందుకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్, చిన్న ఎల్‌పీజీ సిలిండర్, గ్యాస్‌కట్టర్, గ్లౌస్‌లు, నల్లటి రంగు స్ప్రే బాటిళ్లను కొను గోలు చేశారు. గతేడాది జులై 8న హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం కొల్లగొట్టి రూ.30 లక్షలు దోచుకున్నారు. రెండు బైక్‌లను చోరీ చేసి కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్ అ క్కడి నుంచి హర్యానాకు పారిపోయారు. ఈ కేసు లో పోలీసులు అమీర్, అబిద్, అర్షద్‌ను అరెస్టు చే యగా, అబ్దుల్లా తప్పించుకున్నాడు. ఇదే కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన అమీర్ మళ్లీ అబ్దుల్లా తో కలిసి వాజీబ్, అబీద్, ఇక్రామ్‌లను కలుపుకొని కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. జహీరాబాద్‌లోని టోల్‌ప్లాజా వద్ద ఏటీఎం చోరీకి యత్నించారు. డిసెంబర్ 31న జిల్లా కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొల్లగొట్టేందుకు యత్నించగా పోలీసులు రావడంతో పరారయ్యారు.
చిక్కారిలా..
జిల్లా కేంద్రంలో నిఖిల్‌సాయి హోటల్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టగా అబ్దుల్లా, అమీ ర్, మరి కొందరు అనుమానాస్పదంగా కనిపించా రు. దీంతో వారి వాహనం తనిఖీ చేయగా కర్రలు, ఇతర మరణాయుధాలు లభించాయి. అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం అబ్దుల్లా, అమీర్, వాజీద్‌ఖాన్, మొహమ్మద్ అజీబ్, ఇక్రామ్‌ను అరెస్టు చేశారు. సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్‌అలీ, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై సుమలత పాల్గొన్నారు.
శివపురి జైలులో..
హర్యానా రాష్ట్రానికి చెందిన అబ్దుల్లా ఖాన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అసీఫ్, అర్షద్, అజ్మీర్‌లను కలుపుకొని 2018లో ఉదయ్‌పూర్‌లో ఏటీఎం కొల్లగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఏటీఎంను కొల్ల గొట్టి రూ.8 లక్షలు దోచుకున్నారు. విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు అబ్దుల్‌ను పట్టుకొని శివపురి జైలుకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన అమీర్, మధ్యప్రదేశ్‌కు చెందిన బాలికను తీసుకువచ్చిన కేసులో అరెస్టయ్యి శివపురి జైలుకు చేరుకున్నాడు. అప్పటికే ఇదే జైలులో ఉంటున్న అబ్దుల్లాతో అమీర్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి తెలంగాణలో దొంగతనాలు చేయాలని భావించారు. వీరికి తోడు మరికొందరిని కలుపుకొని చోరీలకు పాల్పడుతూ వచ్చారు.


