క్రీడల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌తో కలిసి సీఎం కప్ టార్చ్‌రిలే ర్యాలీ ప్రారంభం
సుభాష్‌నగర్: క్రీడా రంగంలో జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకొని శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటె క్నిక్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లా నుంచి నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఎంతో గొప్ప విషయ న్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. తాను కూడా స్విమ్మింగ్ క్రీడాకారిణి అని, ఫ్రీ స్టైల్, రిలే, బట్టర్ ఫ్లై తదితర విభాగాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక స్థైర్యం
సీపీ సాయి చైతన్య
సుభాష్‌నగర్: క్రీడలు యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతాయని, మానసిక స్థై ర్యాన్ని పెంపొందిస్తాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. సీఎం కప్–2 టార్చ్ ర్యాలీ ముగింపు కార్యక్రమం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో సీఎం కప్–2026 కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
క్రీడల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలి


