పరీక్షలకు సిద్ధం కావాలి
● ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న
ఖలీల్‌వాడి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు భ విష్యత్తులో బంగారు బాట వేస్తుందని ఉమ్మ డి జిల్లా ఇంటర్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డె న్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్, ఆర్మూ ర్, డిచ్‌పల్లి కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉన్నాయని, విద్యార్థులు సి ద్ధం కావాలని తెలిపారు. ఇంటర్ బోర్డు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని, ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తీ ర్ణత సాధించేందుకుగాను చదువుపై దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థులు చదువుతున్న క్రమంలో వచ్చే అనుమానాలను నివృత్తి చేయడానికి అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారరని అన్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఒడ్డెన్న మాట్లాడుతూ అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలన్నారు. 20న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతం చేసేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఐఈవో తిరుమలపుడి రవికుమార్, ప్రిన్సిపాళ్లు బుద్ధిరాజ్, చంద్రవిఠల్, విజయలక్ష్మితోపాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ పరీక్షకు శిక్షణ
ఖలీల్‌వాడి: బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలకు సిద్ధమయ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ గంగారాం, ఇంచార్జి డైరెక్టర్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడ ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఐదు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు http.//tsstudycircle.co.in వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉండి, కుటుంట వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు తక్కువ ఉన్నావారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 8 న నిజామాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని, మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9440196945, 9951199460, 9490511953 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
‘సాగర్’కు
సింగూరు జలాలు
● నేటి నుంచి నీటి విడుదల
నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టునుంచి నిజాంసాగర్‌కు శనివారం నీటి విడుదలను ప్రారంభించనున్నారు. రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 8 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా వదలనున్నారు. సింగూరు ప్రాజెక్టు కరకట్టతో పాటు రివిట్‌మెంట్ బలోపేతం పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఉన్న నీటిని ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో 8 టీఎంసీలను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వరద గేట్ల ద్వారా రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున దిగువనకు విడుదల చేయనున్నారు. మంజీర డ్యాంతో పాటు మంజీర నది ద్వారా సింగూరు జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరతాయి.
పరవళ్లు తొక్కనున్న మంజీర
వర్షాకాలంలో భారీ వర్షాలు కురియడంతో దాదాపు సీజన్ మొత్తం మంజీర నది పరవళ్లు తొక్కింది. నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో నది శాంతించింది. అయితే సింగూర్‌నుంచి నీటిని విడుదల చేయనుండడంతో మరోసారి నదికి జలకళ రానుంది.
నిజాంసాగర్‌లో 14 టీఎంసీల నిల్వ
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,402.44 అడుగుల(14.253 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
పరీక్షలకు సిద్ధం కావాలి


