వీబీ జీ రామ్ జీతో గ్రామాల అభివృద్ధి
● అవకతవకలకు చెల్లుచీటి
● చట్టంతో రాష్ట్రాల బాధ్యత పెరిగింది
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: వికసిత్ భారత్ రోజ్‌గార్ ఔర్ అజీవిక మిషన్ (వీబీ జీ రామ్ జీ) చట్టం భవిష్యత్ గ్రామాల అభివృద్ధికి దిక్సూచిలాంటిదని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయ న మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి మాట్లాడారు. వీబీ జీ రామ్ జీ చట్టంతో గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు, పని దినాలు 125 రోజులకు పెంచడం, ఎస్టీ, ఆదివాసీ, గిరిజనులకు 150 రోజులు పని కల్పించడమేనని తెలి పారు. అనేక పథకాలను అధ్యయనం చేసి శాసీ్త్రయంగా ఈ పథకాన్ని కేంద్రం రూపొందించిందని పేర్కొన్నారు. ప్రధానంగా అవకతవకలకు చెల్లుచీటి పలికిందని, రాష్ట్రాల వాటా 40 శాతానికి పెంచిందని చెప్తూనే.. దేశంలో అధిక రా ష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు గుర్తెరగాలన్నారు. చెల్లింపుల కోసం పనులకు జియో ట్యాగింగ్‌తోపాటు ఆధార్‌కార్డు అనుసంధానం చేస్తూ పని చేసిన వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రతి వారం డబ్బులు నేరుగా జమ అవుతాయన్నా రు. డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. జీ రామ్ జీ పథకంతో రాష్ట్రాలకు బాధ్యత పెరిగిందని, ఈ పథకంలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై గ్రామపంచాయతీకి అవసరమైన పనులను గుర్తించి, పని చేయించాలన్నారు. కేంద్రంపై యుద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నిధులు రాకపోవడం, తగ్గిపోవడం, నిలిచిపోవడానికి రాష్ట్రాలు తమ వాటాను చెల్లించకపోవడమేనని అన్నారు
‘ఇందూరు’గా మార్చి తీరుతాం..
నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ మేయర్ అయిన వెంటనే ఇందూరుగా పేరు మార్చడమే మొదటి ఎజెండాతో ముందుకెళ్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇందూరు పేరు పెట్టి తీరుతామని, హిందుస్తాన్ అనే పేరు భవిష్యత్‌లో ఉంటుందన్నారు. నిజాంషుగర్స్, నిజాంసాగర్ కెనాల్, నిజామాబాద్‌లో యూజీడీ, అభివృద్ధి నిలిచిపోయాయని, నిజాం పేరు మారిస్తేనే శని పోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేయని వారికి ఓటేస్తే ప్రయోజనం ఉండదని మైనార్టీలు, ఎంఐఎంలను ఉద్దేశించి పేర్కొన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జ్యోతి, పంచరెడ్డి ప్రవళిక, మల్లేశ్ యాదవ్, మాస్టర్‌శంకర్, కిషన్ పాల్గొన్నారు.


