ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమి క్రోమా రంగోలి‘ ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో సుమారు 100 మంది విద్యార్థులు రసాయన శాస్త్రం, పండుగల సాంప్రదాయం, వివిధ సామాజిక రుగ్మతలలోని భావనలను రంగవళ్లుల ద్వారా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. ప్రొఫెసర్లు లావణ్య, రవీందర్‌రెడ్డి, సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, భరత్‌రాజ్, నహీదా బేగం, రాజేశ్, రమ ణ, రాము, రంజిత్, చంద్రకళ, శ్రీవర్ష పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండలంలో..
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామంలోగ ల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల జూ నియర్, డిగ్రీ కళాశాలలో గురువారం సంక్రాంతి వే డుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలికలకు భోగి పండ్లు, భోగి మంటలు, రంగ వ ల్లికలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంత రం విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ అనూష, సిబ్బంది ఉన్నారు.
ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు


