వైభవంగా అయ్యప్ప పడిపూజ
నిజామాబాద్ రూరల్: నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే నివాసంలో గురువారం అయప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ దంపతులతో సహా వారి కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు ధన్‌పాల్ ప్రణయ్ స్వామి భక్తిశ్రద్ధలతో అయ్యప్పకు పూజలు చేశారు. పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వాములకు, భక్తుల కోసం భిక్షను ఏర్పాటు చేశారు. బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి, అయ్యప్ప మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
శబరిమలకు తరలిన స్వాములు
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు గురువారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు. గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరుముల్లు కట్టుకుని శబరిమలకు వెళ్లారు. స్వాములు గంగారెడ్డి, భూమన్న , ప్రేమ్, సతీష్ , ప్రసాద్, శ్రీధర్, శ్రీనివాస్ ఉన్నారు.
వైభవంగా అయ్యప్ప పడిపూజ


