క్యాలెండర్ అవిష్కరణ
ఖలీల్‌వాడి:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోగల డీఈ వో కార్యాలయంలో గురువారం డీఈవో అశోక్ సీఆర్‌పీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జి ల్లా అధ్యక్షుడు అంబదాస్, ప్రధాన కార్యదర్శి అంజయ్యలు సీఆర్‌పీల సమస్యలపై డీఈవోకు వినతిప త్రాన్ని అందించారు. డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఉన్నారు.
మోపాల్: మండలంలోని కంజర్ పెద్ద చెరువులో మత్య్సశాఖ ఆధ్వర్యంలో 1,42,060 చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. ఎంపీడీవో రాములు నాయక్, ఒడ్డెరకాలనీ సర్పంచ్ సుమలత, ఎంపీవో కిరణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, మత్య్సశాఖ ఇన్‌ఛార్జి లక్ష్మీ, గంగపుత్రులు ఉన్నారు. అనంతరం కాస్‌బాగ్ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఎంపీడీవో పరిశీలించారు.
నిజామాబాద్ లీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్‌గౌడ్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులను కలిసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ అవిష్కరణ


