విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్: విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, కరెంట్ సమస్యలపై ట్రాన్స్‌కో సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటార ని ఏడీఈ బాలేష్ అన్నారు. మండలంలోని మోపాల్‌లో గురువారం విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీ ఈ క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రా మంలో విరిగిపోయిన స్తంభాలు, వేలాడుతున్న వి ద్యుత్ వైర్లు, వంగిన స్తంభాలను పరిశీలించారు. సర్పంచ్ ద్యాప రవికుమార్, లైన్‌మన్ మనోహర్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ప్రజాబాట గురువారం నిర్వహించారు. సర్పంచ్ బాకారం వరలక్ష్మీ ఆధ్వ ర్యంలో ట్రాన్స్‌కో అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి, ఏఈ శివకుమార్, సంతోష్, ఉపసర్పంచ్ నవీన్, సుమన్ ఉన్నారు.


