ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలైన ఎస్‌ఎస్‌ఆర్ (స్వయం ప్రతిపత్తి) కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను గురువారం వర్సిటీ వీసీ యాదగిరిరావు , రిజిస్ట్రార్ యాదగిరి ఆవిష్కరించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 40.59 శాతం ఉత్తీర్ణత కాగా, బాలికలు 57.14 శాతం, బాలురు 30.27 శాతం పాస్ అయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల సిబ్బంది విద్యార్థులపై చూయించే క్రమశిక్షణ వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్, వర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, యూజీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆంజనేయులు, అడిషనల్ కంట్రోలర్స్ శాంతాబాయి, సంపత్, కళాశాల కరస్పాండెంట్ హరితాగౌడ్, కంట్రోలర్ జి. శ్యాం కుమార్, అడిషనల్ కంట్రోలర్ ఎండీ యూసుఫ్, సలీం, ఎస్. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


