బాల శాస్త్రవేత్తలు.. ప్రగతికి బాటలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ రెండో రోజు గురువారం కొనసాగింది. ప్రాంగణం వైజ్ఞానిక కాంతులతో మెరిసిపోతోంది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేయిర్ సందర్భంగా 33 జిల్లాల నుంచి 887 ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు చిన్నారులు చూపిన ’శాసీ్త్రయ’ పరిష్కారాలు పెద్దలను సైతం ఆలోచింపజేస్తున్నాయి.
ఆయా జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ప్రదర్శనలను తిలకింపజేశారు. న్యాయనిర్ణేతలు ప్రదర్శనలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించారు. నేడు జరగబోయే ముగింపు కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు.
రెండో రోజు కొనసాగిన
రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్
ఆకట్టుకుంటున్న 33 జిల్లాల విద్యార్థుల ఆవిష్కరణలు
నేడు ముగింపు, విజేతల ప్రకటన


