రక్షణ చట్టంపై అవగాహన అవసరం
● న్యాయవాది కవిత రెడ్డి
తెయూ (డిచ్‌పల్లి): పని ప్రదేశాల్లో మహిళలు తమకు వర్తించే రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యాయవాది కవితా రెడ్డి సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో గురువారం క్యాంపస్‌లోని వసతిగృహంలో ‘పని ప్రదేశాల్లో మహిళలు– రక్షణ చట్టాలు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది కవిత రెడ్డి మాట్లాడుతూ మహిళలు నిర్భయంగా పనిచేయాలన్నదే పోష్ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి తదితరులు ప్రసంగించారు. అనంతరం అవగాహన సెల్‌ను ఏర్పాటు చేశారు. సెల్ అధ్యక్షురాలిగా ప్రొఫెసర్ లావణ్య వ్యవహరిస్తారు.
మీనాక్షిని కలిసిన శేఖర్‌గౌడ్
నిజామాబాద్‌రూరల్: పీసీసీ కార్యవర్గ సమావేశానికి వెళ్లిన సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్ హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌ను కలిశారు.
రక్షణ చట్టంపై అవగాహన అవసరం


