క్రైం కార్నర్
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
రుద్రూర్: పోతంగల్ మండలం చేతన్‌నగర్ గ్రామానికి చెందిన మల్గె నాగవ్వ (67) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ఈ నెల 3న ఉదయం వంట చేసేందుకు సిలిండర్ స్టౌ వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు నాగవ్వ చీర కొంగుకు మంట అంటుకొని తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వేల్పూర్: మండలంలోని పడగల్ క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 3న అచేతనంగా పడిఉన్న గుర్తుతెలియని వ్యక్తి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి పడగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని తోట వద్ద పడి ఉన్నట్లు అందిన సమాచారంతో 108 అంబులెన్సులో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మరణించినట్లు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎస్‌హెచ్‌వో 8712659862, పోలీస్‌స్టేషన్ 87126597960 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జరిమానా
వర్ని: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ బోధన్ జడ్జి శేష తల్పసాయి తీర్పునిచ్చినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ నెల 6న సైదిపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా మండల కేంద్రంలో పట్టుకున్నామన్నారు. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి జరిమానా విధించినట్లు తెలిపారు.


