ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా వారు ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై పలు సూచనలు చేశారు. నిజామాబాద్ అగ్ని మాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సెమీస్‌లోకి నిఖత్ జరీన్
సుభాష్‌నగర్: నేషనల్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీస్‌లోకి చేరింది. గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న పోటీల్లో 5–0తో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుసుమ్ బగేల్‌తో నిఖత్ జరీన్ తలపడనుంది.
మానసిక సమస్యలకు
చికిత్స అందించాలి
– డీఎంహెచ్‌వో రాజ శ్రీ
సుభాష్‌నగర్: పిల్లల్లో మానసిక సమస్యలను గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో రాజ శ్రీ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ, ఐఎంఏ, చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో పిల్లల్లో మానసిక సమస్యల ద్వారా కలిగే మార్పులను సమన్వయపర్చే విధానంపై జిల్లా వనరుల కేంద్రంలో శిక్షణా కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ శ్రీ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న ప్రతి పిల్లవాని మానసిక అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించాలన్నారు. ప్రారంభ దశలోనే కౌన్సిలింగ్ ఇచ్చి నడవడిక, ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేలా సంరక్షకులు నడుచుకోవాలని సూచించారు. సైకియాట్రి స్టు రవితేజ జిల్లా సంక్షేమ అధి కారి రసూల్ బీ, చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ వ్యవస్థాపకుడు, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు సంపూర్ణ, కమిటీ మెంబర్ దారం గంగాధర్, నాగేశ్వరరావు, డీహెచ్‌ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి
డీఎస్పీ కార్యాలయం
బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గురువారం మార్చారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయా కార్యాలయాలకు జనవరి నుంచి అద్దె చెల్లించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీచర్స్ కాలనీలో అద్దె భవనంలో ఉన్న డీఎస్పీ కార్యాలయాన్ని బోధన్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు.
ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్


